రైతుబీమాతో దీమా

కామారెడ్డి,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. రైతు మృతి చెందితే మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు రైతుబీమాపై విమర్శలు మానుకోవాలన్నారు. లేకపోతే కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు తరిమి కొడతారని అన్నారు. కంటివెలుగుతో ప్రజలు మేలు కలుగుతోందని అన్నారు. కంటి వెలుగు శిబిరాలతో గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. చాలా మంది నిరుపేద ప్రజలంతా తమ నేత్ర పరీక్షలు చేయించుకున్న అనంతరం సంతోషంగా వెనుదిరుగుతున్నారు. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతో పాటుగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంతో ఆనంద పడుతున్నారు. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

——