రైతులకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పై అవగాహన సదస్సు

ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామంలో  రైతులకు ఆరోగ్య భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మందు ను పిచికారీ చేసేటప్పుడు అనుసరించ వలసిన ముఖ్య మైన అంశాల పట్ల టి.ఎం.ఐ సారధ్యంలో సింజెంట ఇండియా లిమిటెడ్ వారి నేత్రత్వం తో రైతులకు అవగాహన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టి.ఎం.ఐ మరియు నిదాన్ ప్రాజెక్టు మేనేజర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతులు మందు పిచికారీ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పంట పాలలో పిచికారీ చేసే విధి విధానాల గురించి రైతులకు సూచించారు అదేవిధంగా వ్యక్తి గత ఆరోగ్యం మరియు పరిశుభ్రత యొక్క సూత్రాలను తెలియజేసారు  రైతులకు పంటలకు సంరక్షించే ఉత్పత్తులను తాళం వేసి భద్రపరచాలి పిల్లలను దూరంగా ఉంచటం ఉపయోగించే మందు లేబుల్ ను పూర్తిగా చదవాలని రక్షణ దుస్తులు ధరించాలి కర్ర సహాయం తో నీటిలో బాగా కలపాలి గాలి వెంబడి పిచికారీ చేయండి పిచికారీ చేసే సమయంలో తినటం గాని త్రాగటం గాని చేయకూడదని నీటిని త్రాగేముందు ఆహారం తీసుకొనే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి పర్యావరణ కాలుష్య ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కోన్నారు ఈ కార్యక్రమంలో  టి.ఎం.ఐ ప్రతినిధులు కళ్యాణ్ కుమార్,వికాస్, సర్పంచ్ ,ట్రైనర్ రాజేందర్ రెడ్డి,మోబిలైజేర్ అల్లం సాయి కిరణ్ గ్రామస్థులు పాల్గొన్నారు.