రైతులకు చేపల పెంపకం పై అవగాహన కల్పించినట్లు కెవికె ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లవ కుమార్
గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): అంతర్జాతీయ ఎరువుల అభివృద్ధి సంస్థ ఇక్రిశాట్ హైదరాబాద్ వారి అధ్వర్యంలో రంగా రెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోని 30 గ్రామాలకు చెందిన రైతులకు చేపల పెంపకంపై అవగాహన కల్పించినట్లు కెవికె గడ్డిపల్లి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. లవకుమర్ తెలియజేసారు. రాష్ట్రంలో నీటి వనరుల లభ్యత పెరగడంతో చాలా మంది మత్స్య పరిశ్రమపై అసక్తి చూపిస్తున్నారని అన్నారు. నూతనంగా చెరువుల నిర్మాణం చేపట్టే వాళ్ళు అనువైన ప్రదేశం ఎంపిక చేసుకొని దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించుకోవాలని తెలిపారు. నాణ్యమయిన జీరో సైజ్ చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేసుకొని 6 నుండి 8 నెలల సమయంలో పట్టుబడి చేసుకోవచ్చునని ఈ పద్దతి చాలా లాభదాయకంగా ఉంటుందని రైతులకు తెలియజేసారు. ఈ పర్యటనలో కెవికె లో అజోల్లా సాగు చేపల పెంపకం చెరువులను సందర్షింపజేసీ అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఇ ఎఫ్ డి సి అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ కొండల మురళి మోహన్ కెవికె శాస్త్రవేత్తలు ఏ కిరణ్, నరేష్, నరేష్, ఆదర్శ్, సుగంధి, డా.టీ మాధురి లతో పాటు ఫీల్డ్ మానిటరింగ్ ఆఫీసర్స్ టీ. మల్లా రెడ్డి, రుక్మిణీ వెంకట్ రామ్ రెడ్డి, పాండు, సురేష్, మల్లేష్ అశోక్, బాల్ రాజు, ప్రభాకర్ 55 మంది పాల్గొన్నారు.