రైతులకు నష్టాలు లాగుతున్న కూరగాయల కమిషన్ ఏజెంట్స్*
మార్కెట్ యార్డ్ అధికారుల అండ దండ *
కూరగాయల కమిషన్ ప్రెసిడెంట్ యే దారి తప్పిన వైనం
గద్వాల్ ఆర్ సి. సెప్టెంబర్,(జనం సాక్షి);
జోగులాంబ గద్వాల్ జిల్లా లోని కూరగాయల మార్కెట్ యార్డ్ వ్యాపారి చిన్న రంగన్న బుదవారం మరణించడం తో
గురువారం అనగా 29.09.22. నాడు బంద్ ప్రకటించడం జరిగింది.కూరగాయల కమిషన్ ఏజెంట్ లలో ఐదు గురు రేపు బంద్ అనగా ఈ రోజు సాయంత్రం రైతులకు చెప్పకుండా వాళ్లకు పూర్తిగా
బంద్ అని తెలిపి వారు సాయంత్రం వ్యాపారం చేశారు. అంతే కాక సాయంత్రం వేలం పాట ను కొనసాగించాడo జరిగింది. పూర్తి సమాచారం రాగ రైతులు వెళ్లి చూడగా అక్కడ కమిషన్ ఏజెంట్స్ పిటి ఎన్,రఘు,ఆంజనేయులు, జమీర్ తమ వద్ద ఉన్న కూరగాయలను కాకుండా బయట నుంచి తెప్పించి వేలం పాటను కొనసాగించారు. రైతులకు కూరగాయల ధరలు లేవనీ బాధ ఉన్న మార్కెట్ యార్డ్ లు తేవడం జరుగుతుంది. అయినప్పటికీ రైతులకు తెలియకుండా మోసంచేస్తున్నారు. వీరి ఏడు గురి పై కేసులు ఉన్న కోర్టు కు తిరుగుతూ బయపడడం
లేదన్నారు. కూరగాయల మార్కెట్ లో కొంత మంది రిమాండ్ కు వెళ్లిన తర్వాత కూడా ఇదే పనిగా రైతులకు బంద్ అని చెప్పి వారు దందా నడిపిస్తున్నారు.వీరి లైసెన్స్ ను వెంటనే రద్దు చేసి మార్కెట్ నుంచి బహిష్కరించాలని రైతులు కోరారు.వీరి ద్వారా మిగతా కమిషన్ ఏజెంట్స్ లను కూడా వ్యాపారం చేయలేని స్థితికి దారి తీస్తుంది. కొందరి కమిషన్ ఏజెంట్ వల్ల మిగతా వారికి ఇబ్బంది అవుతుంది అని తెలిపారు.వీరి పై వెంటనే చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు లను ,మార్కెట్ యార్డ్ చైర్మెన్ ను కోరడం జరిగింది.