రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి  జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్ డిమాండ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై4(జనంసాక్షి):
ఖరీఫ్ వ్యవసాయ పనులు మొదలైనవి కనుక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని మార్కెట్లో కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని, కాలపరిమితి దాటిన విత్తనాలను కూడా అమ్ముతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో బీసీ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.అంతేకాకుండా విత్తనాలు ఫర్టిలైజర్ ఎరువులను ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా కొందరు రైతులు తమ దృష్టికి తెచ్చారని ఉద్దెర పేరుతో ఎక్కువ ధరలు తీసుకోవడం తగదని సీడ్స్, ఫర్టిలైజర్ పరిధి షాపులో ఉన్న అన్ని విత్తన దుకాణాలను తనిఖీ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందేలా చూడాలని కొనుగోలు చేసిన విత్తనాలకు రైతులకు వ్యాపారులు జిఎస్టి తో కూడిన రసీదు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్,రైతు సంఘం నాయకులు దాసరి నిరంజన్ యాదవ్,ఉపాధ్యక్షులు సదుర్ల తిరుపతయ్య,సుధాకర్ గౌడ్,కొట్ర శీను, రాము తదితరులు పాల్గొన్నారు.