రైతులకు రుణమాఫీ, కొత్త రుణాల అందజేత: బిక్కసాని.

– బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రొత్త రైతులు 85 మందికి రూ 30 లక్షలు రుణము.

– 255 మంది రైతులకు రూ 55 లక్షల రుణమాఫీ అందజేత…

బూర్గంపహాడ్ అక్టోబర్ 13 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం లో ఖరీఫ్ పంటకు సంబంధించి 85 మంది కొత్త రైతులకు 30 లక్షల రూపాయల రుణమును, రుణమాఫీకి సంబంధించిన 255 మంది రైతులకు సంబంధించి రూ 55 లక్షల చెక్ ను బిక్కసాని శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కుందూరు పెద్దిరెడ్డి, బొల్లు రవి, కోడి పెద్ద లింగయ్య, ఉండేటి గోవర్ధన్, మేడగం రామిరెడ్డి, సీఈఓ ప్రసాద్, ఉమర్, తిరుపతి రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు