*రైతులకు వేరుశనగ విత్తనాలు వెంటనే పంపిణీ చేయాలి*
అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్*
=============================
మద్దూర్ (జనంసాక్షి) : నారాయణపేట జిల్లా మద్దూరు మండల రైతులకు వేరుశనగ విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మండల వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా కోశాధికారి నర్సింలు మాట్లాడుతూ రైతులకు విత్తనాలను సబ్సిడీ ద్వారా విత్తనాలను ఇవ్వకుండా దళారుల దగ్గరికి చేరవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.దళారులు వేరుశనగ విత్తనాలను రైతులకు అధిక ధరలతో అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. వేరుశనగ విత్తనాలను అధిక ధరలకు రైతులు అప్పు చేసి కొనుగోలు చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. కావున తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావాల్సిన అన్ని సబ్సిడీ విత్తనాలను అందించాలని అఖిల భారత రైతుకులి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని రైతులకు వేరుశనగ విత్తనాలను సబ్సిడీలో వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు రాములు పి డి ఎస్ యు (పివైఎల్) ప్రజా సంఘాల నాయకులు అమీర్ శ్రీహరి విజయ్ మల్లేష్ రమేష్ అంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Attachments area