రైతులకు 397 కోట్ల పంట రుణాలు
ఖమ్మం, జనవరి 28 (ఎపిఇఎంఎస్): గడిచిన ఖరీఫ్‌లో అన్నదాత రైతన్నకు సహకార బ్యాంకు ద్వారా 397 కోట్ల పంట రుణాలు అందించినట్టు సహకార బ్యాంకు జిల్లా సిఇఓ రమణమూర్తి పేర్కొన్నారు. లక్షా 26వేల మంది రైతులకు 397 కోట్ల పంట రుణాలు అందించినట్టు వెల్లడించారు. ఇవన్నీ లక్ష రూపాయల లోపువి కావడంతో వడ్డీలేని వాటిగా పరిగణించనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా రైతులకు 22 కోట్ల రూపాయల వడ్డీభారం తగ్గుతుందని ఆయన తెలిపారు. ఖరీఫ్‌లో వాటికి సంబంధించి అసలును చెల్లించి తిరిగి మళ్లీ రుణాలు పొందవచ్చునన్నారు. అలాగే పంటలపై రుణం తీసుకున్న రైతులంతా ప్రమాదమరణ బీమా పథకంలో చేరాలని ఆయన కోరారు.