రైతులను దగా చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం

-పొలంబాటలో బీజెపి నేతలు

పెద్దపల్లి,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న పొలంబాట కార్యక్రమంలో బాగంగా ఆయన పెద్దపల్లి జిల్లాలోని 8మండలాల్లో ఈకార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించగా కార్యక్రమాన్ని నిర్వహించారు.పెద్దపల్లి జిల్లాలోని 8మండలాల్లో రైతు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించా లని తీసుకున్న నిర్ణయం మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్య లను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈసందర్బంగా గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికి తెలంగానా ప్రభుత్వం సకాలంలో నీరు అందించడం లో విఫలం కావడంతోనే రైతులు వరి పత్తి పంటలను తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు నీటియాజమాన్య పద్దతి తెలువడంలేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన మంచి అత్య ద్బుతమైన ప్రదానమంత్రి ఫసల్‌ భీమా యోజన కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదని దీనివల్లనే రైతులు భారీగా నష్టపోతున్నారన్నారు. తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సమితిల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో బీజెపి ఆద్వర్యంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని గుజ్జుల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కార్యక్ర మంలో జిల్లా పార్టీ అద్యక్షుడు కాశిపేట లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విూస అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.