రైతులను రాజులు చేయడమే టిఆర్‌ఎస్‌ లక్ష్యం

టిఆర్‌ఎస్‌ ఉన్నంత వరకు 24గంటల కరెంట్‌కు ఢోకాలేదు

త్వరలోనే ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

సిద్దిపేటకు త్వరలోనే రైలుకూత

హరీష్‌, రామలింగారెడ్డిలను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి

కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండానే సిద్దిపేట సభ

ఇక్కడి మట్టిబిడ్డనే అంటూ ప్రసంగించిన కెసిఆర్‌

సిద్దిపేట,నవంబర్‌20(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంతవరకు కరెంట్‌కు ఢోకా లేదని, అలాగే ప్రాజెక్టులను పూర్తి చేసుకుని నిరంతరంగా నీరు ఇచ్చే కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. రైతులకు ఇప్పటికే రైతుబందు, రైతు బీమా అమలు చేస్తున్నామని, ఇవి సరిపోవని, వారి బ్యాంకు ఖాతాల్లో కనీసంగా ఓ ఐదు లక్షల నిల్వ ఉన్నప్పుడే అభివృద్ది జరిగినట్లుగా భావించాలన్నారు. స్వయంగా రైతును అయిన తాను రైతుల దశ మార్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసే క్రమంలో వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్‌ మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో సిద్ధిపేట అభ్యర్థి, మాజీ మంత్రి హరీశ్‌ రావు, దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామలింగారెడ్డి ఇద్దరూ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని కేసీఆర్‌ పేర్కొన్నారు. రెండేళ్లలో సిద్ధిపేటకు రైలు మార్గం తెప్పిస్తానని జిల్లా ప్రజలకు హావిూ ఇచ్చారు. విూరిచ్చిన బలంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. రైతు బిడ్డను కాబట్టే తనకు రైతుల కష్టాలు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలి. వచ్చే ఏడాదిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. ఈ గడ్డవిూదే పుట్టి విూ చేతుల్లోనే పెరిగాను. అన్ని రంగాల్లోనూ నెంబర్‌వన్‌గా తెలంగాణ ముందుకెళ్తోంది. కోరుకున్నట్లే సిద్ధిపేట జిల్లా సాకారం చేసుకున్నాం. మెడికల్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. రైతులకు ఉచితంగానే కరెంట్‌ ఇస్తున్నాం.రైతులు అప్పులు తీర్చుకుని మిగులులోకి రావాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు పూర్తి చేసుకుని కోటి ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాం. వచ్చే ఏడాది సిద్ధిపేట నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్లొస్తాయి. తెలంగాణను పంట కాలనీలుగా విభజించాలి’ అని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. ఐకేపీ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. మహిళా సంఘాలకు ఐకేపీ ఉద్యోగులు అండగా ఉండాలన్నారు. రైతులు పండించే మిరప పంటను కూడా మహిళా సంఘాలే కొనుగోలు చేస్తాయి. పంటలను మహిళా సంఘాలే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. లిజ్జత్‌ పాపడ్‌ తయారు చేసిన మహిళా సంఘాల తరహాలో ఐకెపి మహిళలు ముందుకు సాగాలన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ ఆహారశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అవినీతి, కుంభకోణాలు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతూ ఉంటే..సంక్షేమ పథకాలు పెంచాం. అంగన్‌ వాడీలు, ¬ంగార్డులకు అన్ని రాష్ట్రాల్లో కంటే మనమే ఎక్కువ జీతాలు ఇస్తున్నామన్నారు. ఎలాంటి పైరవీలు లేకుండా..పైసా ఖర్చు కాకుండా రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇంటికి చేరాయన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రైతులందరికీ అప్పలే ఉన్నాయి. స్వరాష్ట్రంలో రైతులకు అప్పులు ఉండొద్దు. రైతు బ్యాంకు ఖాతాల్లో నిల్వలుండాలన్నారు. రైతుబంధు

పథకం పెట్టుబడి రాయితీ 10 వేలకు పెంచనున్నాం. రైతులు పండించిన పంటలు డిమాండ్‌ పెరిగి అమ్ముడుపోవాలి. ప్రస్తుతం ఏం కొనాలన్నా..తినాలన్నా కల్తీనే అని సీఎంకేసీఆర్‌ అన్నారు. ఈ సబలో అభివృద్ది గురించి మాత్రమే మాట్లాడిని కెసిఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల జోలికి వెలల్లేదు. వారి గురించి విూకే బాగా తెలుసన్నారు. సిద్దిపేట ప్రజలు బాగా గుర్తించి ఓటేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కెకె, ఎంపి ప్రభాకర్‌ రెడ్డి, ఇటీవలే పార్టీలో చేరిన చెరుకు ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సేవచేసే భాగ్యం కల్పించాలి: రామలింగారెడ్డి

సేవ చేసే భాగ్యం తనకు కల్పించాల్సిందిగా దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. సిద్దిపేట టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సోలిపేట రామలింగారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నలుమూలల నుంచి తరలివచ్చిన అందరికి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేశారు. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో చేపడుతున్న పథకాల రూపశిల్పి మన కేసీఆర్‌ అన్నారు. స్థానికంగా ఒకప్పుడు గ్లాసుడు మంచినీళ్లు కావాలంటే రోజంతా తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. సీఎం అందిస్తున్న ప్రోత్సాహం, ఇస్తున్న చేయూతతో మంచినీటి సమస్యను పరిష్కారించుకున్నామన్నారు. కాళేశ్వరం నీళ్లను కాల్వల ద్వారా దుబ్బాకలోని ప్రతి ఎకరాకు పారించి కరువును శాశ్వతంగా పారదోలడానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం లబ్దిదారులకు అందేలా చూస్తామన్నారు. మమ్మల్ని విూ చల్లని మనసుతోని, పెద్ద మనసుతోని దీవించి కారు గుర్తుకు ఓటేసి విూకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.