రైతులపై సర్కారు వివక్ష
– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్
పాలకుర్తి,నవంబర్ 6(జనంసాక్షి): ఎన్నికల ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రుపాయల రుణమాఫీ చేస్తామని హమి ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, తాము ఆధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకుండా రైతులపై వివక్ష చూపుతుందని టీ, పీసీసీ ఆధ్యక్షులు ఎన్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు, ఆదివారం మండలకేంద్రంలోని కాంగ్రెస్ నాయకుడు చక్రాల రఘు కూతురి వివాహనికి హజరయ్యారు, ఆనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రుణాల కోసం మొత్తం 40 లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని, ఆందులో 37 లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు, బంగారు ఆభరణాలపై మూడు లక్షల మంది మహిళల బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, ఆదేవిధంగా కాంగ్రెస్ హయంలో పేద విధ్యార్థుల కోసం ప్రవేశపెట్టిన యూనివర్సల్ పీజు రీ అంబర్స్‌మెంట్ ను కుడా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు, ప్రభుత్వం వార్షిక భడ్జెట్ లో రూ,,1 లక్షా 30 వేలు కేటాయించినప్పటికిని రైతుల రుణమాఫీ, విధ్యార్దులకు పీజు రీ అంబర్స్‌మెంట్ చెల్లించకపోవడం బాదాకరమన్నారు, రాబోయే రోజుల్లో రైతుల రుణమాఫీ, విధ్యార్థుల రుణమాఫీ విషయంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు, ఈకార్యక్రమంలో డీసీసీ ఆద్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబి చైర్మెన్, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా నాయకులు నమిండ్ల శ్రీనివాస్, గంగారపు అమృతరావు, బత్తిని శ్రీనివాస్, నల్లా శ్రీరాం, బిల్లా సుధీర్‌రెడ్డి, మిత్తింటి వెంకటేశ్వర్లు, నిరంజన్‌రెడ్డి, తాళ్లపెల్లి రమాదేవి, మండల ఆధ్యక్షులు అనుములు మల్లారెడ్డి, రాపాక సత్యనారాయణ, నాయకులు చిలువేరుపెంటయ్య, గడ్డం యాకసోమయ్య, భూమరంగయ్య, జలగం కుమార్, చెరిపెల్లి విజయ్‌కుమార్, రాపాక అశోక్, పోగు శ్రీనివాస్, గిరగానికుమార్, తాళ్లపెల్లి మల్లన్న, చిలువేరు సంపత్, తదితరులు పాల్గోన్నారు,