రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలి.
ప్రపంచ మృత్తిక(నేలల) దినోత్సవ సందర్భంగా సోమవారం రోజున మండల వ్యవసాయ శాఖ ద్వారా ఏడు రైతు వేదికలలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమం,నేల ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు వివరంగా వివరించడం జరిగింది.
ఈ సందర్బంగా మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గడ్డం భీమ్ రెడ్డి మండల కేంద్రం లోని రైతు వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతు సోదరులు నేల సంరక్షణలో వ్యవసాయ శాఖ సూచించిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలని భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులు చెలలో వేసుకోవాలని అన్నారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన పంట భూములను అందించాలని అన్నారు.ఈ సందర్భగా మండల వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి అన్నారు.ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకోవాలి అన్నారు.అధిక ఎరువుల వాడటం ద్వారా భూసారం తగ్గడం తోపాటు రైతుకి పెట్టుబడి పెరుగుతుందని అన్నారు. మోతాదు మించి ఎరువులు గడ్డి మందులు వాడటం వలన భూసారం దెబ్బ తింటుందని అన్నారు. పశువుల ఎరువులు వాడటం ద్వారా సేంద్రియ ఎరువులు పంటలకు అందటం తో పాటు భూసారం రక్షించ బడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు రైతు బంధు సమితి సభ్యులు రైతులు పాల్గొన్నారు.