రైతుల ఉక్కు కవచం కేసీఆర్‌

` దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి : కేటీఆర్‌
` కాంగ్రెసోళ్లు కరెంట్‌పై మాట్లాడగలరా..?
` బిజెపికి మతపిచ్చి
` మాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు
` రెండు దశాబ్దాల నిర్మల్‌వాసుల కల సాకారం
` శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతలను కు ప్రారంభించిన మంత్రి
` పామాయిల్‌ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన
నిర్మల్‌(జనంసాక్షి):ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్‌ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి.. విద్యుత్‌ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాల్వలపై మోటార్లు పెట్టి.. బ్రహ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు. ఇవాళ మనకు కేసీఆర్‌ ధైర్యం. రైతు రక్షణ కవచం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నిర్మల్‌ నియోజకవర్గంలో నిర్మల్‌ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో రూ. 714 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ`27 (లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకం)ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పోచంపాడ్‌ వద్ద రూ. 300 కోట్లతో నిర్మించే పామాయిల్‌ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.  ఒకప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి ఆగమయ్యేది అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మనం రివర్స్‌ పంపింగ్‌ చేపట్టిన తర్వాత ఎస్సారెస్పీ నిండుకుండలా మారింది. సముద్రంలాగా కనబడుతుంది. ఇది కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది. సాగునీటి విషయంలో కష్టాలు తప్పాయి.. కాబట్టి ఓటు వేసే ముందు రైతులు ఆలోచించాలి. 24 గంటల కరెంట్‌ వస్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్‌ కారణం. రైతుబీమాతో రైతుల కుటంబాలను ఆదుకుంటున్నాం. అదే విధంగా కేసీఆర్‌ వడ్లను కొంటున్నాడు. నరేంద్ర మోదీ కొన్నా కొనకపోయినా.. నష్టమొచ్చినా భరిస్తాడనే విశ్వాసం, నమ్మకం రైతులకు ఏర్పడిరదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రూ. 300 కోట్లతో పామాయిల్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పామాయిల్‌ను మన దేశంలో 75 శా తం మంది ఉపయోగిస్తున్నారు. మనం వినియోగించే పామాయిల్‌ను ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వరి ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్‌ను అధిగమించిపోయాం. కాబట్టి అందరూ వరి ధాన్యం పండిరచకుండా ఉండేందుకు ఆయిల్‌ పామ్‌ పంటలను ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ తయారయ్యే పామాయిల్‌ను భారతదేశానికి పంపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నాం. ఆయిల్‌ పామ్‌ తోటలో అంతర్‌ పంటలు వేసుకోవచ్చు. వరి కాకుండా ఏ ఇతర పంటలైనా వేసుకోవచ్చు. గెలలు వచ్చే వరకు అంటే మూడు నాలుగేండ్ల వరకు అంతర్‌ పంటలు పండిరచుకోవచ్చు. నిర్మల్‌, ఆదిఅలాబాద్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల జిల్లాల రైతులు పండిరచిన ఆయిల్‌ పామ్‌ పంటను ఈ ఫ్యాక్టరీ వాళ్లు కొని ప్రాసెస్‌ చేస్తారు. 35 ఏండ్ల వరకు ఢోకా లేదు. నెలకు జీతం తీసుకున్నట్టే రూ. 12 వేలు బ్రహ్మాండంగా నెల నెల ముడుతాయి. అప్పుడప్పుడు ఎక్కువ కూడా రావొచ్చు. సంవత్సరానికి ఎకరానికి లక్షన్నర ఆదాయం ఆయిల్‌ పా మ్‌ రైతులకు వచ్చే అవకాశం ఉంది. ఆయిల్‌ పామ్‌ పంటకు కోతులు, పందుల బెడద ఉండదు. ఈ ఫ్యాక్టరీ ద్వారా స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అయింది అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
మాట్లాడడానికి కాంగ్రెస్‌ నాయకులు కరెంట్‌ గురించి మాట్లాడగలరా..!
కరెంట్‌ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్‌ నాయకులకు ఇజ్జత్‌ ఉండాలె అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి స్పష్టం చేశారు. నిర్మల్‌ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. దివాలాపూర్‌ మండలంలో రూ. 714 కోట్లతో నిర్మించిన శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతలకు ప్రారంభించుకున్నాం అని కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 50 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం. సోన్‌ మండలం పాక్‌పట్ల గ్రామంలో రూ. 300 కోట్లతో పామాయిల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపనం చేశాం. ఈ ఫ్యాక్టరీలో 300 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. నిర్మల్‌ పట్టణంలో వందల కోట్ల రూపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం అని మంత్రి తెలిపారు. రెండు సార్లు కేసీఆర్‌ను ఆశీర్వదించి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని నడుపమని అవకాశం ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు. మళ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ తొమ్మిదినరేండ్లలో ఏం చేశామో.. మళ్లా ఎందుకు ఓటేయాలని కోరుతున్నామో.. చెప్పడానికి వచ్చాం. మేం చేసింది, చెప్పింది నిజమైతే కడుపు నిండా ఓట్లు వేయండి. ఒక వేళ మేం చెప్పింది తప్పయితే ఓట్లు వేయకండి. 2014లో కరెంట్‌, తాగు, సాగునీటి పరిస్థితి ఎట్ల ఉండే. ఇప్పుడు ఎట్ల ఉందో ఆలోచించి ఓటేయండి. నిర్మల్‌ పట్టణం అభివృద్ధి చెందింది. 2014కు ముందు ఏదైనా కష్టమొస్తే.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారుల దగ్గరకు వెళ్లాలంటే 70 కిలోవిూటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నిర్మల్‌లోనే కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించుకున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులందరూ ఇక్కడకు వచ్చారు. మన కలెక్టరేట్లు ఉన్నట్లు.. ఇతర రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా లేవు అని కేటీఆర్‌ తెలిపారు. 2014కు ముందు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఉండేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యేలకు భయం. ఎక్కడ కుండలు, బిందెలు అడ్డం పెడుతారో అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. పదేండ్ల కింద 10 గంటలు కరెంట్‌ పోతే అడిగినోళ్లు లేరు. ఇప్పుడు 10 నిమిషాలు కరెంట్‌ పోతే ఆగమైపోతున్నారు. ఒక్కటే గుర్తు చేస్తున్నా. 28 రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్‌ ఇవ్వడం లేదు. కేవలం కేసీఆర్‌ మాత్రమే ఉచిత కరెంట్‌ ఇస్తున్నారు. ఎక్కడ ఉన్నది కరెంట్‌ మాకు కనబడుతలేదు అని బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. నిర్మల్‌ జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు బస్సులు ఏర్పాటు చేస్తాం. ఏ ఊరికి పోతరో పోండి. ఏ టైంకు పోతరో పోండి. వరుసగా నిలబడి గట్టిగా కరెంట్‌ తీగలను పట్టుకోండి.. కరెంట్‌ వస్తుందో లేదో తేలిపోతది. రాష్ట్రానికి కూడా దరిద్య్రం వదిలిపోతది. మాట్లాడానికి సిగ్గు శరం ఉండాలి. 2014కు పూర్వం కరెంట్‌ సమస్యలు ఉండేవి. కరెంట్‌ గురించి మాట్లాడటానికి కాంగ్రెస్‌ నాయకులకు ఇజ్జత్‌ ఉండాలె. రోజుకు 6 గంటల కరెంటని చెప్పి.. ఏనాడూ ఆరు గంటలు ఇవ్వలేదు. మూడు గంటలు ఒకసారి, మరోసారి మూడు గంటల కరెంట్‌ ఇచ్చేవారు. ఎరువులు, విత్తనాల కోసం పోలీసు స్టేషన్లు, దుకాణాల ముందు చెప్పుల లైన్లు దర్శనమిచ్చేవి. ఇవాళ కడుపు నిండా కరెంట్‌ ఇస్తున్నారు కేసీఆర్‌. నేను చెప్పేది వాస్తవమైతే మాకు ఓటేయండి.. తప్పయితే విూకు ఇష్టమున్నట్లు ఓటు వేసుకోండి అని కేటీఆర్‌ సూచించారు.
రైతుల ఉక్కు కవచం కేసీఆర్‌
మాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా బీఆర్‌ఎస్‌పై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను ఓడిరచేందుకు గతంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి పనిచేశాయని ఆయన గుర్తు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్‌ రaూటా పార్టీ అని.. 2018లో ఆ పార్టీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వచ్చి బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామని తెలిపారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ఢల్లీి బాస్‌ల అనుమతి లే కుండానే లక్ష్మణ్‌ ఈ వ్యాఖ్యలు చేశారా? అని ప్రశ్నించారు. అప్పుడే బీజేపీ చేసిన ఆఫర్‌ను బీఆర్‌ఎస్‌ తిరస్కరించిందని స్పష్టం చేశారు.అప్పట్లో కె.లక్ష్మణ్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తాకథనాలను కూడా ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశారు. సెలెక్టివ్‌ అమ్నేషియాతో బాధపడుతూ.. ఇష్టం వచ్చినట్లు స్టోరీలు అల్లే పొలిటికల్‌ టూరిస్టులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. 105 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం మాకు లేదన్నారు. జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉండగా.. బీజేపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మేం ఫైటర్స్‌.. చీటర్స్‌ కాదు అని స్పష్టం చేశారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి
రెండు దశాబ్దాల నిర్మల్‌వాసుల కల సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ `27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎత్తిపోతల పథకానికి స్విచ్‌ ఆన్‌ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించారు. ఈ పథకం ద్వారా నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌ (జి), కుంటాల, సారంగాపూర్‌, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, సోన్‌ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్‌ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించి పనులను పూర్తి చేశారు. మొదటి యూనిట్‌ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించారు. ఇందులో భాగంగా దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో సిస్టర్న్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌, రైట్‌ మెయిన్‌ కెనాల్‌లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్‌`1 కింద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో గుండంపెల్లి వద్ద ఇప్పటికే పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 6.70 కిలోవిూటర్ల పొడువుతో అప్రోచ్‌ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 29.50 కిలో విూటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 13.50 కిలోవిూటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది. ఇదిలా ఉంటే రెండో యూనిట్‌ కింద 5 వేల ఎకరాల ఆయకట్టును నిర్ధేశించారు. దీనికోసం దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో మొదటి పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద రెండో పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తి పోయనున్నారు. దీని పరిధిలో లెఫ్ట్‌ కెనాల్‌ పొడువు 7.50 కిలోవిూటర్లు కాగా, రైట్‌ కెనాల్‌ పొడువు 3.75కిలోవిూటర్లుగా ఉంది. ఆయా కెనాల్స్‌ నీటి సరఫరా సామర్థ్యం 20 క్యూసెక్కులుగా ఉంది. అలాగే.. 3వ యూనిట్‌ కింద 13 వేల ఆయకట్టును నిర్ధేశించారు. సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామం వద్ద మూడో పంప్‌హౌస్‌ నిర్మాణంలో ఉంది. ఈ పంప్‌హౌజ్‌లోని రెండు పం పుల ద్వారా సరస్వతీ కెనాల్‌లో నుంచి నీటిని ఎత్తి పోయాలని ప్రతిపాదించారు. దీనికింద 17.50 కిలోవిూటర్ల మేర లెఫ్ట్‌ కెనాల్‌, 1.90 కిలోవిూటర్ల మేర రైట్‌ కెనాల్‌ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి