రైతు దీక్షను విజయవంతం చేయాలి
టీ.ఎస్.యూ నియోజకవర్గం అధ్యక్షులు చెరుకు శివ
మునుగోడు సెప్టెంబర్24(జనంసాక్షి):
తెలంగాణ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మునుగోడులో
ఈనెల29న జరిగే చర్లగూడెం రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా చేపట్టే దీక్షకు సంబంధించి పోస్టర్ ను శనివారం మండల కేంద్రంలో నియోజకవర్గం అధ్యక్షులు చెరుకు శివగౌడ్ ఆవిష్కరించారు.ఈసందర్బంగా మాట్లాడుతూ చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వసితులకు గతంలో రైతులకి ఇచ్చిన హామీలు అమలను చేయాలని డిమాండ్ చేసే దీక్షకు ప్రజలు,ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రైతు దీక్షను విజయవంతం చేయగలరని కోరారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ పుల్కరం శివ,నియోజకవర్గం కార్యదర్శి తీగల శశి,గడ్డం లింగస్వామి,మండల అధ్యక్షులు గోలి ప్రవీణ్,చౌటుప్పల్ మండల అధ్యక్షులు జాజుల సాయి,రపొల్ నరేష్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area