రైతు బీమా 2022- 23 దరఖాస్తు గడువు పెంపు

మిర్యాలగూడ. జనం సాక్షి
కొత్తగా భూమి రిజిస్టర్ చేయించుకున్న రైతులు మరియు అంతకుముందు రైతు బీమా చేసుకొని రైతులు ఈ సంవత్సరం రైతు బీమా చేసుకోవడానికి అవకాశం ఉన్నదని మండల వ్యవసాయ అధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.నియమ నిబంధనలు రైతు భూమి 22. 6.2022 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. రైతుకు ఎన్ని చోట్ల భూమి ఉన్న ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది. రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకము ఆధార్ కార్డు నామిని ఆధార్ కార్డు జిరాక్స్ దరఖాస్తు ఫారం ఏఈఓ కు అందజేయాలి మీరు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు కావున ఇప్పుడే మూడు అడుగులు వేసి మూడు కాగితాలు అందివ్వండి. మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించండి.
చివరి తేదీ 13. 8 .2022
అదేవిధంగా పిఎం కిసాన్ ఈ కేవైసీ చేసుకొని రైతులను కూడా ఈనెల 13.08.2022 లోపు చేయించుకోగలరు. తర్వాత పడే 12వ విడత ఈ కేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పడుతుంది. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.

 

 

తాజావార్తలు