రైతు రుణ మాఫీ అమలు చేయాలి

రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం హుజూర్ నగర్, సెప్టెంబర్ 22(జనం సాక్షి): ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం అన్నారు. గురువారం అనుముల గూడెం గ్రామ రైతు సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి నూతన రుణాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం కార్యవర్గ సభ్యులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రైతు సంఘం గౌరవ అధ్యక్షులుగా సత్యనారాయణ రెడ్డి, అధ్యక్షులుగా కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కుక్కడపు వెంకటేష్ గౌడ్ తో పాటు వల్లభ దాస్ భద్రయ్య, ఓరుగంటి మల్లమ్మ, సామల సీతమ్మ గోవిందులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రేపాకుల మురళి, రేపాకుల వెంకన్న, ఎస్ వెంకటి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.