రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7  రాష్ట్రప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని రెంజల్‌ మండలంలో శుక్రవారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూరు చేసామని, నిధులతో త్వరలో పనులు ప్రారంభించాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే అలీసాగర్‌, గుత్పా ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి వ్యవసాయ పోలాలకు నీటిని అందిస్తామని అన్నారు. అదే విధంగా ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి సంతృప్తిని ప్రకటించారు. ఈయన వెంట కాంగ్రెస్‌ నాయకులు తాహెర్‌, మండలాల కాంగ్రెస్‌ నాయకులు పలువురు ఉన్నారు.