రైతు సంక్షేమమే మా ఏ జెండా
టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు న్యాయం జరిగింది
టిఆర్‌ఎస్ ప్రచారంలో అభ్యర్థి పుట్టమధు
మంథని, నవంబర్ 25(జనంసాక్షి):- ఏ ప్రభుత్వం కూడ రైతును ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రైతులకు న్యాయం జరిగిందని మంథని టిఆర్‌ఎస్ అభ్యర్థి పుట్టమధు అన్నారు. మంథని నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి పుట్టమధు ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది, మండలంలోని ఎక్లాస్‌పూర్, నల్లిపల్లి, శాస్త్రులపల్లి గ్రామాలతో పాటు మంథని పట్టణంలోని కూరగాయాల మార్కెట్, అంబేడ్కర్ చౌరస్తాలతో పాటు ఇతర వాడల్లో తిరుగుతూ ఇంటింటికి, గడపగడపకు పుట్టమధు ప్రచారం చేపట్టారు. ఓటర్లను టిఆర్‌ఎస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఏ గ్రామానికీ వెళ్లిన వాడకు వెళ్లిన మహిళలు, యువకులు నృత్యాలతో, కోలాటాలతో మంగళహారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రచారం అనంతరం పుట్టమధు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగెళ్లలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, ప్రతి ఒక్కరు లబ్ధిచేకురాయని పుట్టమధు అన్నారు. ప్రతి పేదింట్లో ఆనందం చూడాలన్నాదే సిఎం కేసిఆర్ లక్ష్యమని, వారికోసం ప్రవేశెపెట్టిన పథకాలు వారి అభివృద్దకేనని వారి సంతోషం కోసం సిఎం కృషి చేస్తున్నామన్నారు. గతం ప్రభుత్వంలో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనికి కారణమైన ప్రభుత్వాలను ఓటుతోనే సమాధం చేప్పి గద్దె దించారని, ప్రతి ఒక్కరు టిఆర్‌ఎస్ పార్టీకే ఓటు వేసి మద్దతు తెలుపుతూ గెలిపించారని, వారి నమ్మకాన్ని మామ్ము చేయకుండా రైతుల ఆత్మహత్యలు జరగకుండా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవెశపెట్టారని, అందులో పెట్టుబడుల కింద ఎకరాకు 8వేలు ఇచ్చామని, ఇప్పుడు మళ్లి రూ. 10వేలు పెంచామని అన్నారు. గత కాంగ్రెస్ నాయకులు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి వేళాలలో రైతులు వ్యవసాయ సాగు నీటి కోసం వెళ్తే కరెంటు షాక్‌లతో రైతులు మరణస్తే ఆ కుటుంబం రోడ్డన పడి శవంతో ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఏ ప్రభుత్వం కూడ వారిని ఆదుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటల కరెంటు నిరంతరంగా ఇస్తున్నామని, రైతు భీమా కింద రూ. 5లక్షలు ఇస్తున్నామని, రైతుల గురించి ఆలోచించే పార్టీ ఒక టిఆర్‌ఎస్ పార్టీనే పుట్టమధు అన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మాజీ సర్పంచ్ పుట్టశైలజ, ఎంపిపి ఎగోళపు కమల, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఎగోళపు శంకర్‌గౌడ్, టిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొండశంకర్, నాయకులు మంథని లక్ష్మిరాజం, బుర్ర మల్లికార్జున్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఎస్‌కె యాకుబ్, ఆసిఫ్, ఇర్ఫాన్, ఖలీల్, డిగెంబర్, పోలు కనుకరాజు, మబ్బు నాగరాజు, ఆకుల సమ్మయ్య, దండేవన పోఛం, జడిగల రాముతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.