రైతు సమస్యలు తీర్చాలని సిఎంకు వినతి

జుక్కల్, అక్టోబర్ 10,( జనం సాక్షి),
తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సమస్యలు తీర్చాలని
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసిఆర్ కు తహసీల్దార్ గణేష్ ద్వారా సోమవారం వినతి పత్రం అందజేశారు. ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేయాలని, విద్యుత్ సమస్యలు తీర్చాలని, పంటల భీమా అమలు చేయాలని, పంటనష్ట పరిహారం అందించాలని, వన్య ప్రాణుల నుండీ పంటలకు రక్షణ కల్పించాలని, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని, రెవిన్యూ సమస్యలు తీర్చాలని, సమగ్ర భూసర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో 11చక్కెర కర్మా గారాలు ఉండగా 5మాత్రమే పని చేస్తున్నాయని మిగితా ఫ్యాక్టరీలు కూడా పనిచేసే విదంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రం ద్వారా సిఎం ను కోరారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల భారతీయ కిసాన్ సంఘం అద్యక్షులు నాగల్ గిద్ధే శివానంద్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.