రైలు ప్రమాదంలో 15కు చేరుకున్న మృతుల సంఖ్య
` ఇద్దరు లోకోపైలట్లు, గార్డు మృతి
` 100 మందికిపైగా గాయాలు
విజయనగరం(జనంసాక్షి):విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి. వారిలో విశాఖ`రాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు , పలాస ప్యాసింజర్ గార్డు ఎంఎస్ రావు కూడా ఉన్నారు. మృ తదేహాలను విజయనగరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పుకోస్తా రైల్వే,ఇతర విభాగాల సిబ్బంది వెయ్యి మందికిపైగా పాల్గొంటున్నారు. దెబ్బతిన్న ట్రాక్‌ను యుద్ధప్రాతిప దికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను ట్రాక్‌పై నుంచి తొలగించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ప్రమాదం నేప థ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాటిలో రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్`పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి.