రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు:వ్యక్తి అరెస్టు
సికింద్రాబాద్ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్ విభాగం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడలోని రైల్వే వాటర్ వర్క్స్ కార్యాలయంలో పనిచేసే అదిత్య అదే ప్రాంతానికి చెందిన లింగస్వామికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దపాలుగా రూ.70 వేలు వరకు డబ్బులు వసూలు చేయగా విజిలెన్స్ విభాగం అధికారులు చాకచక్యంతో వ్యవహరించి పట్టుకున్నారు. గతంలో అదిత్య కొంత మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.