రైస్ మిల్లింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి : అదనపు కలెక్టర్ పి. రాంబాబు.

  నిర్మల్ బ్యూరో, జులై29 ,,జనంసాక్షి,,,   జిల్లాలో కస్టం రైస్ మిల్లింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్  పి. రాంబాబు రైస్ మిల్లర్లను ఆదేశించారు.  శుక్రవారం
జిల్లా పాలనాధికారి  సమావేశం మందిరంలో  41  రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లింగ్ ప్రక్రియ కు భారత ఆహార సంస్థ అనుమతించిన నేపథ్యంలో త్వరగా పనులు ప్రారంభించి  పూర్తి చేయాలని అన్నారు.   వివరనాత్మకంగా  చర్చిస్తూ  మిల్లర్ల వారిగా  టార్గెట్ ను  నిర్ణయిస్తూ  రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నులు తగ్గకుండా సి యం అర్ రైస్  డెలివరీ  చేయాలని అన్నారు.సివిల్ సప్లై కార్పొరేట్,  FCI భారత ఆహార సంస్థ కు  ఆగస్టు 23 లోగా  సరఫరా చేయాలని,  ఆ లోగా   రైస్ మిల్లర్లు నిర్దేశిత లక్ష్యాలను  చేరుకోకపోతే  మిల్లర్ల పై  కఠిన చర్యలు తీసుకోవడం  జరుగుతుందని  హెచ్చరించారు.అవసరమైన హమాలీలను  ఏర్పాటు చేసుకోవాలని,నిర్దేశిత సమయంలో భారత ఆహార సంస్థ కు  సరఫరా చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. 2020-2021 సంవత్సరం నకు  సంబందించిన  యాసంగి 830 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం  ఆగస్టు 4వ తేదీ లోపు పూర్తి చేయాలని,   వానకాలం  2021-2022 సంవత్సరం  నకు  సంబంధించి  40,634 మెట్రిక్ టన్నులు వరి ధాన్యం  ఆగస్టు 23వ తేదీలోగా పూర్తి చేయాలని అన్నారు.ఇందుకు రైస్ మిల్లర్లు సహకరించి  త్వరితగతిన మిల్లింగ్ చేసేందుకు  అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు.ఈ సమావేశంలో DM శ్రీకళ,  రైస్ మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area