రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు భాస్కర్ పై చేసిన ఆరోపణలో వెనక్కి తగ్గేది లేదు

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నది వాస్తవం కాదా?
6A కేసులు నమోదైన వారికి సిఎంఆర్ బియ్యం సప్లై చేస్తున్నది వాస్తవం కాదా?
—–సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 15(జనం సాక్షి)
రైస్ మిల్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బచ్చు భాస్కర్ పై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేసిన ఆరోపణలు వాస్తవం అని వాటిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అన్నారు.
రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్న రైస్ మిల్ వ్యాపారులను బెదిరింపుల గురి చేస్తున్న మాట వాస్తవం కాదా? *రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కోళ్ల ఫారలకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నది వాస్తవం కాదా 6A కేసులు నమోదైన వారికి CMR ధాన్యాన్ని కేటాయించడం లేదా?అని సిపిఎం కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. శని వారం నగరం లోనీ సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రేషన్ బియ్యాన్ని వీధి వ్యాపారులను పెట్టుకొని సేకరిస్తున్న మాట వాస్తవం కాదా? రేషన్ బియ్యం తరలిస్తున్న అక్రమ ముఠాను కొంతమంది పైన కేసులు పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని దీని వెనుక రేషన్ బియ్యం మాఫియాను పట్టుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
*గతంలో జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం స్మగ్లర్ గా పేరు పొంది అనేకసార్లు పోలీసులకు పట్టుబడి,6A కేసులు నమోదు అయిన వారికి మళ్లీ ధాన్యాన్ని ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు సిపిఎం నిరాధారమైన ఆరోపణలు చేయలేదని చేసిన అన్ని ఆరోపణలకు కట్టుబడి ఉంటామని పూర్తి ఆధారాలతో చూపిస్తామని, అసోసియన్ లో కొంతమంది సభ్యుల తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కలెక్టర్ గారు అక్రమ రేషన్ బియ్యం పైన దృష్టి కేంద్రీకరించి,కఠినమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ ఉన్నత కమిటీతో విచారణ జరిపించాలని అన్నారు.