రోగులను పట్టించుకోని వైద్య సిబ్బంది…

చర్యలు తీసుకోవాలి… ఆందోళనలు చేస్తాం…
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్.
శంకరపట్నం జనం సాక్షి అక్టోబర్ 7
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను పట్టించుకోవడంలేదని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం దళిత సంఘాల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ శంకరపట్నం మండల పరిధిలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా కిలోమీటర్ల కొద్ది వయోవృద్ధులు రోగులు, వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు వస్తే ,వైద్య సిబ్బంది రోగుల పట్ల, వయోవృద్ధుల పట్ల దుర్సుగా ప్రవర్తిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరించి, రోగులను మనోవేదనకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వము ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పత్రిక ప్రకటనలు చేస్తున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేద రోగు, పేద కుటుంబాలకు చెందిన రోగులకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఫలాలు, అందడం లేదని చెప్పారు. ప్రభుత్వo ప్రవేశపెట్టిన కార్పొరేట్ వైద్య సేవలను, మండల ప్రజలకు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిపై శాఖ పరంగా చర్యలు తీసుకొని మండల ప్రజలకు రోగులకు తగిన న్యాయం చేయాలని కోరారు లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. క్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి మెరుగు శ్రీనివాస్, ఆల్ ఇడియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు గొట్టి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.