రోడ్డుకు మట్టి పోసి మరమ్మతులు

“జనంసాక్షి” కథనానికి స్పందన
రోడ్డుకు మట్టి పోసి మరమ్మతులు
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి-పెదరాజుపేట గ్రామాల మధ్య పాడైన మట్టి రోడ్డును బాగు చేయండి అనే శీర్షికతో జనంసాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ సమస్యపై సీపీఐ (ఎం) మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి అనంతరం పంచాయతీ కార్యదర్శి కి వినతిపత్రం అందజేశారు. వెంటనే జనంసాక్షి ప్రత్యేక కథనానికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సుమారు వంద ట్రిప్పుల మొరాన్ని పోసి చదును చేయించారు. “జనంసాక్షి”ని స్థానిక పంచాయతీ కార్యదర్శి రజిత, సర్పంచ్ కత్తుల కృష్ణవేణి, ఎంపీటీసీ గూడూరు బాలరాజ్ లను గ్రామస్తులు అభినందించారు.
Attachments area