రోడ్డుపైగోతులను పూడ్చిన టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్
పోచారం నుండి జహీరాబాద్ వెళ్లే రహదారి గోతుల మాయంగా మారడంతో మండల పరిధి లోని లింగంపల్లి పోచారం శివారుల మధ్య గల బీటి రహదారిపై ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితోపాటు టి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వినోదులు గోతిని పూడ్చారు. వేగంగా వస్తున్న వాహనాలకు గోతులు ఏర్పడక ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గోతులు పూడ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్క వాహనా చోధకులు నెమ్మదిగా ప్రయాణించాలని వారు సూచించారు.