*రోడ్డు పనులను ప్రారంభించిన పెద్దేముల్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు*
జనంసాక్షి జూలై16 పెద్దేముల్:
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం లోని ఖానాపూర్ గ్రామం నుండి బండపల్లి గేటు వరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 10 లక్షలు మట్టిరోడ్డు పనులకు మంజూరు చేయడంతో ఖానాపూర్ గ్రామ సర్పంచ్ రేగొండి నర్సింలు ఆధ్వర్యంలో రోడ్డు పనులను పెద్దేముల్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ…గ్రామాల ఆభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొహీర్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు.రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతాయని, రోడ్డు పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.గ్రామాలఅభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప్పసర్పంచ్ మల్లేశం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




