రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఖానాపురం : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటలో ఈ తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతున్ని అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జి. రమణ (33)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.