రోడ్లపై ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకోని పాలకులు అధికారులు..
సమస్య పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం..
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 15
అల్వాల్ మునిసిపల్ పరిధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారై మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుందని అల్వాల్ డివిజన్ బిజెపి నాయకులు ఆరోపించారు. అల్వాల్ సర్కిల్ లో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ నాగమణి జలమండలి అధికారి సాంబయ్య లకు అల్వాల్ డివిజన్ బిజెపి ప్రధాన కార్యదర్శి తూప్రాన్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్వాల్ మునిసిపాలిటీ లోజిహెచ్ఎంసి,జలమండలిఅధికాలుల సమన్వయం లోపాల వలన తీవ్రమైన వరదనీరు, మురుగునీరు సమస్యలు తీవ్రమై ప్రజలను ఇబ్బంది చేస్తున్నాయన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన తక్షణమే సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ అల్వాల్ డివిజన్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అల్వాల్ మునిసిపాలిటీలో ఓల్డ్ అల్వాల్ లోని పాత రామాలయం వద్ద గత 3 నెలలుడ్రైనేజీమురుగునీరురోడ్లు పైనేఏరులైపారుతుందని, మురుగునీరు ప్రవహిస్తున్న సమీపానే ఓల్డ్ అల్వాల్ లొనే అతి పురాతన మైన రామలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీనికి పక్కనే ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలు ఉన్నాయని, అస్తవ్యస్తంగా రోడ్డుమీద పారుతున్న డ్రైనేజీ మురుగునీటితో.. అటు స్కూలుకు వచ్చే విద్యార్థులుఅనారోగ్యంనికిగురవు తున్నారన్నారు. హాస్పిటల్కువచ్చేరోగులకుకూడాము రుగునీరుదుర్వాసననుభరించలేకపోతు న్నారాన్నరు.ఓల్డ్ అల్వాల్ నుండి టెంపుల్ అల్వాల్ కు వెళ్లే దారిలో మహాలక్ష్మీ దేవాలయం నుండి శ్రీ బేకరీ వరకు మెయిన్ రోడ్డుపైనే మురుగునీరు ప్రవర్తిస్తుంది. దీనివలన మెయిన్ రోడ్డులో వ్యాపారులు చేసుకొనే వ్యాపారస్తులకు సమీపాన ఉన్న కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అల్వాల్ మునిసిపాలిటీ లోని ఫాథర్ బాలయ్య కాలనీ నుండి సూచిత్ర చౌరస్తా వెళ్లే దారిలో బీహెచ్ఈఎల్ కాలనీ వద్ద గత 4 నెలలుగా మురుగునీరు ఏరులై రోడ్డుపైనే పారుతుంది. దీనివలన అటు సూచిత్ర చౌరస్తా వెళ్లే వాళ్లకు, ఇటు క్రిష్ణమ్మ ఎనక్లేవ్ వెళ్ళే వాళ్లకు దారిపొడవునా మురుగునీటీలో ప్రయాణం చేయవలసి వస్తుంది. దీనివలన ప్రతి రోజు ఈరోడ్డులోవాహనదారులుప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం లోని మహాభోది స్కూల్ దగ్గర రైల్వే బ్రిడ్ క్రింద డ్రేనైజీ పైపు లైన్ దెబ్బతినడం వలన మురుగునీరుతో పాటు వరద నీరు నిల్వడం వలన రాకపోకలు నిలిచిపోయాయనీ, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. వెస్ట్ వెంకటాపురం నుండి కనజీగూడకు వెళ్లే రైల్వే ట్రాక్ మజీద్ వద్ద వర్షపు నీరు నిలవడం వలన ఆరోడ్డు గుండా వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. లోతుకుంట నుండి వెంకటాపురంకు వెళ్లే దారిలో లక్ష్మీకళ థియేటర్ వద్ద వెంకట్రావుపేట నుండి లక్ష్మీనగర్ కాలనీలోకి వర్షపు, వరద నీరు రోడ్డుపైనుంది పారుతుంది.దీనివలన చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులకు ఇబ్బందులు పడుతున్నారు. అల్వాల్ సర్కిల్ లోని మురుగునీరువరదనీరు సమస్యలపై అల్వాల్ డివిజన్ బీజేపీ శాఖఆధ్వర్యంలో అల్వాల్ మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ జలమండలి అధికారులకు సమస్యలు తెలుపుతూ వినతిపత్రం అందజేశారు. మురుగునీరు, వరదనీరు సమస్యలను యుద్ధప్రాతిపదికన తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ అల్వాల్ డివిజన్ తరపున డిమాండ్ చేశారు. పై సమస్యలను తక్షణమే పరిష్కరించబడిని యెడల సమస్య పరిష్కారం అయ్యేవరకు భారతీయ జనతా పార్టీ ప్రజాపక్షన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ క్రిష్ణ రెడ్డి, బీజేపీ అల్వాల్ డివిజన్ అధ్యక్షుడు కార్తీక్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి తూప్రాన్ లక్ష్మణ్, మల్లికార్జున్ గౌడ్, సుదర్శన చారి, లావణ్య, ప్రశాంత్ రెడ్డి, అనిల్, కృష్ణ, అరవింద్ రెడ్డి, నాగి, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|