రోడ్‌మ్యావ్ ప్రకటించేవరకు ఆందోళనలు : పొన్నం ప్రభాకర్
వరంగల్ : తెలంగాణపై కేంద్రం రోడ్‌మ్యావ్ ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్షంలో ఇచ్చిన లేఖకు తెదేసా కటుబడి ఉంటే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలమని పాదయాత్రలో వెల్లడించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. జనవరి 4న తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన చెప్పారు.