రౌడీషీటర్‌ దారుణ హత్య

పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఓ రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్‌ నగర్‌లో గత రాత్రి దనాల చిన్నా(28) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో చిన్నా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిపై గోదావరిఖనిలో పలు వివాదాస్పద కేసులున్నట్లు తెలుస్తోంది. అందరూ చూస్తుండగానే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చిన్నాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని అన్నారు.