లంక ఆటగాళ్ళకు సెంట్రల్ కాంట్రాక్టులు ఎస్‌ఎల్‌పిఎల్‌లో ఆడేందుకు అంగీకారం
కొలంబో, జూలై 18 (జనంసాక్షి): శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆదేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న వివాదం సమసిపోతుంది. ఆటగాళ్లకు బోర్డు కొత్త సెంట్రల్ కాంట్రాక్టులు ప్రకటించడంతో శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు ఆ దేశ క్రికెటర్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. కొత్త కాంట్రాక్టులు 2012 మార్చి 1 నుండి 2013 ఫ్రిబ్రవరి 28 వరకూ వర్తిస్తాయి. బయటకు వెల్లడించక పోయీనా.. మ్యాచ్ ఫీజులు పెంచేందుకు బోర్డు అంగీకరించేందుకు తెలుస్తోంది. గత కొంత కాలంగా సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో బోర్డుకు, ఆటగాళ్ళకు వివాదం నడుస్తోంది. కాంట్రాక్టుల పై తమకు స్పష్టమైన హామీ ఇప్తేనే లీగ్‌లో ఆడతామని ఆ జట్టు కెప్టెన్ జయవర్థనే మంగళవారం స్పష్టం చేశారు. అందుకే ఇప్పటి వరకూ తామూ ఎవరు లీగ్ కాంట్రాక్టులపై సంతకాలు చేయలేదన్నారు. మొదటి సెంట్రల్ కాంట్రాక్టులు వ్యవహరంపై కొలిక్కి వస్తేనే లీగ్ లో ఆడడం ఆలోచిస్తామని తేల్చి చేప్పేశాడు. దీంతో శ్రీలంక ప్రీమీయర్ లీగ్ నిర్వహణపై కాస్త సందిగ్ధత నెలకొంది. అయితే బోర్డు క్రికెటర్ల తో రాజీ పడి కాంట్రాక్టులు ప్రకటించడంతో వివాదం సద్దు మణిగింది. జయవర్ధనే ప్రకటన చేసిన 24 గంలటు గడవక ముందే బోర్డు సమస్యను పరిష్కరించడం విశేషం. నిజానికి గత ఏడాది గత ఏడాది ప్రపంచకప్ నుండీ లంక క్రికెటర్లకు జీలాలు ఇవ్వడం లేదు. డిపెంబర్‌లో ఐసీసీ వాటికి సంబంధించిన 42.36 శాతం మ్యాచ్ ఫీజులను ఆటగాళ్లకు చెల్లించింది. నేరుగా ఆటగాళ్ళ బ్యాంక్ అకౌంట్లకే మొత్తాలను ట్న్రాన్సఫర్ చేసి&ంది. అయితే మిగిలిన మొత్తాలకు సంబంధించి లంక బోర్డే చెల్లింపులు జరపాలి. గద కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న లంక బోర్డు తమ ప్రభుత్వ సహకారాన్ని కోరింది. దీంతో లంక క్రీడా శాఖామంత్రి ఆదేశాల ప్రకారం బ్యాంక్ ఆఫ్ సౌలాన్ దాదాపు 600 మిలియన్లను చెల్లించేందుకు అంగీకరించింది. ఇద్దరి మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం ఫిబ్రవరి 28 వరకూ కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్ల జీతాలను మూడు నెలల క్రితం చెల్లించారు. ప్రపంచకప్ కోసం లంక క్రికెట్ బోర్డు స్టేడియాల నిర్మాణానికి భారిగా ఖర్చు పెట్టడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎరుర్కొంది. ఇప్పుడు సెంట్రల్ కాంట్రాక్ట్‌లపై ఆటగాళ్ళ డిమాండ్ కు తలొగ్గి జీతాలు పెంచేందుకు శ్రీలంక క్రెకెట్ బోర్డు నిర్ణయించింది. బోర్డు నిర్ణయంతో ఎస్‌ఎల్‌పిఎల్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయినట్టు చెప్పొచ్చు. భారత్ నిర్వహిస్తోన్న ఐపీఎల్ తరహలోనే లంక బోర్డు ఈ లీగ్ కు శ్రీకారం చుట్టింది. దీనిలో 56 మంది విదేశీ క్రికెటర్లతో పాటు 107 మంది లంక క్రికెటర్లూ ఆడనున్నారు. ఈ లీగ్ ఆగష్ట్ 10 నుండి 24 వరకూ జరగనుంది.