లండన్‌ టార్చ్‌ అందుకోనున్న లక్ష్మి మిట్టల్‌

లండన్‌, టార్చ్‌ 24 (జనంసాక్షి): భారత స్టీల్‌ దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ లండన్‌ టార్చ్‌ అందుకోనున్నారు. గేమ్స్‌ ప్రారంభోత్సవానికి ముందురోజు జరిగే రిలేలో మిట్టల్‌తో పాటు ఆమన కుమారుడు ఆదిత్య కూడా పాల్గోనున్నాడు. ఒలింపిక్స్‌ స్టేడియానికి సమీపంలో ఉన్న జెయింట్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌ ఆర్బిట్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న మిట్టల్‌ సంస్థ భారత క్రీడాకారులందరికి కూడా ఆర్థిక సహాయన్నందిస్తోంది. ఈ సందర్భంగా గురువారం జరుగనున్న టార్చ్‌ రిలేలో పలువురు ప్రముఖులతో పాటు మిట్టల్‌, ఆయన కుమారుడు పార్టిసిపేట్‌ చేయనున్నారు. ప్రతిష్ఠాత్మకమైన లండన్‌ టార్చ్‌ అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని, క్రీడాస్పూర్తితో పాటు మంచి సందేశాన్ని ఇచ్చే ఈవెంటులో తాము భాగంగా కావడం గౌరవంగా భావిస్తున్నామని లక్ష్మిమిట్టల్‌ చెప్పారు. ప్రపంచ ఉక్కు కంపెనీలలో ఒకటైన మిట్టల్‌ సంస్థ ఒలింపిక్స్‌ కోసం 20మిలియన్ల పైగా స్పాన్సర్‌ చేసింది. స్టేడియాలకు కావాల్సిన స్టీల్‌ను ఇక్కడ నుండే వినియోగించుకున్నారు. భారత అథ్లెట్లకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఇవాళ రాత్రి మన క్రీడాకారులకు మిట్టల్‌ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.