లంబాడ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి..

బేల, అక్టోబర్ 7 ( జనం సాక్షి ) చట్ట బద్ధత లేని లంబాడీ లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో  తహసిల్దార్ బడాల రాం రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు సిడాం నందకూమర్ , ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు ఆడా శంకర్,కోరంగే సోనేరావ్, సర్పంచ్ జంగషావ్, కోడప భీం రావ్, ఆడా సంతోష్, మాడవి భీం రావ్ తదితరులు పాల్గొన్నారు.