లక్కీ డ్రా లో లడ్డు ను గెల్చుకున్న నాగరాజు

జనం సాక్షి,నర్సంపేట

నర్సంపేట కోర్టు పక్కన శ్రీ దుర్గామాత అమ్మ వారి ఆవరణ లో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మ వారి విగ్రహం వద్ద లడ్డు లక్కీ డ్రా లో సుమారు 600 మంది భక్తులు పాల్గొనగా అందులో చెన్నరావు పేట మండలం అక్కల్చెడ గ్రామానికి చెందిన జనం సాక్షి విలేఖరి పాలడుగుల నాగరాజు-సావిత్రి ల కు 35 కిలోల లడ్డును లక్కీ డ్రా లో గెలుపొందటం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు లడ్డును భక్తుల సమక్షంలో అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీ కనకదుర్గా దేవి ఉత్సవ కమిటీ సభ్యులు నాగరాజు, నరేష్, శీలం రమేశ్, గోపి, భాస్కర్, కోటేశ్వరరావు, విజేందర్, కొమురయ్య, యాదగిరి,సదానందం, సాంబమూర్తి, సాయి గణేష్, భార్గవ్,రాజు,చిరంజీవి,బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.