లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు

మక్తల్ సెప్టెంబర్ 30 (జనంసాక్షి) శ్రీ  శ్రీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు 17వ సం దసర శరన్న వరత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారు ఒక్క కోటి రూపాయల తో  లక్ష్మిదేవి అలంకరణతో అమ్మవారు భక్తులకు  దర్శనమిచ్చారు. ఉదయం గణపతి పూజ, అభిషేకం, కలశపూజ, సాయంత్రం బతుకమ్మ, సామూహిక కుంకుమార్చన, అనంతరం గజ వాహన సేవ, మహా మంగళ హారతి నిర్వహించారు. సాయంత్రం నారాయణపేట జిల్లా ఆర్యవై శ్య మహాసభ మహిళ విభాగ్ అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల మహిళ విభాగ్ నుండి బతుకమ్మలను సుందరంగా అలంకరించుకొని వాసవి దేవాలయానికి విచ్చేసి బతుకమ్మలు ఆడుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర మహిళ వీభాగ్ ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ బతుకమ్మల పోటీలో గెలుపొందిన వారికి పట్టు చీరల బహుమతి ప్రదానం చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, ఆలయ  కమిటీ అధ్యక్షుడు కట్ట సురేష్, వాసవి దేవాలయ కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్త, అర్యవై శ్య సంఘం అధ్యక్షులు బోరిసెట్టి భాస్కర్, అర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వా శ్రీనివాస్, మండల అధ్యక్షులు మనసాని నాగరాజ్, యువజన సంఘం అ్యధ్యక్షుడు వడ్వట్ వెంకటేష్ అర్యవై శ్య మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.