లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం
ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్
కడెం ఆగుస్ట్ 12(జనం సాక్షి) లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన సందర్భంగా నేడు ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు కడెం మండల కేంద్రంలో మండల నాయకులతో కలిసి సీఎం కెసిఆర్,మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి గార్ల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు అన్నారు. లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం ద్వారా కడెం మరియు దస్తురబాద్ మండలలోని చాలా గ్రామాల రైతులకు చాలా లబ్ధి చేకూరుతుందని అన్నారు. లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం 49 కోట్లను కేటాయించినట్లు తెలియజేశారు ప్రాజెక్టు పూర్తి కాగానే కడెం మరియు దస్తురబాద్ మండలాలలోని వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది అని అన్నారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ కేసీఆర్ గారికి మరియు మంత్రి కేటీఆర్ గారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ వారు మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ అజ్మీర రేఖ శాం నాయక్ గారు లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం కోసం చాలా శ్రమించారని వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని వారు తెలియజేశారు.అనంతరం మండల కేంద్రంలో పలువురు నాయకులకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గారు రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.