లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దారేది…….
జనం సాక్షి రాయికల్ జూలై 27…..
రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మాణానికి సిహెచ్ఎన్వి కృష్ణారావు నివేదిత దంపతులు మరియు భూపతిపూర్ ప్రజలు భక్తుల సహకారంతో నిర్మించబడ్డ లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకోవడానికి అనునిత్యం వందలాది మంది భక్తులు విచ్చేస్తున్న స్వామివారి దర్శనానికి వెళ్లే రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలాసార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించిన ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల సహకారంతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని భక్తులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు