లక్ష కొట్టు డబల్ బెడ్ రూమ్ పట్టు లేదంటే ఖాళీ చెయ్ ? గ్రామ సర్పంచ్, కమిటీ సభ్యులు, పి ఆర్ ఏ ఈ , అధికార పార్టీ నాయకుల వేధింపులు !

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండలం లోని మైలారం గ్రామానికి చెందిన బూరదీప ముక్తేశ్వర్ జిల్లా కలెక్టర్  కు తమకు వచ్చిన డబుల్ బెడ్  రూము కాళీ  చెయ్యాలని వేధిస్తున్న విషయం పై ఫిర్యాదు  చేసినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. మైలారం గ్రామానికి గత ప్రభుత్వ హయాంలో 45 డబల్ బెడ్ రూములు మంజూరైనట్లు  వారు పేర్కొన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు దాదాపు 70 శాతం పూర్తయినాయి. అని  కానీ వాటిని ప్రారంభించక ముందు  ప్రోసిడింగ్  ప్రకారంగా  సీరియల్ నెంబర్ ప్రకారం వారి వారి ఇండ్లలోకి గత రెండు నెలల క్రితం   నుండి ఉంటున్నారు.  ఇండ్లనిర్మాణానికి ముందే ఒక బోరు వేసి మోటార్ బిగించడం జరిగింది. అలాగే   తాత్కాలికంగావిద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వడం
జరిగిందని   వారు తెలిపారు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఆ గ్రామ సర్పంచ్ నల్లని అరుణ తిరుపతి రావు,  పి ఆర్  ఏఈ  నరేష్ ,  డబల్ బెడ్ రూమ్ ల కమిటీ సభ్యులు, కొంతమంది అధికార పార్టీ నాయకులు కలసి లక్ష రూపాయలు ఇస్తే ఉండు లేదంటే  డబల్ బెడ్ రూమ్ కాల్ చేసి  వెళ్ళిపోమని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎందుకు వెళ్లిపోవాలని ప్రోసిడింగ్ లో నాకు 40 నెంబర్  గల ఇల్లు నా పేరు పై  ఉందని అందులో నేను ఉన్నానని  డబల్ బెడ్ రూమ్ లబ్దిదారు అయినా బూర దీప   ఎస్సీ మల కులమునకు చెందిన వారం కావడం వల నన్ను నా భర్తను నా కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేస్తు ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంపై సంబంధిత గణపురం   పోలీస్ స్టేషన్  లో ఎస్ ఐ అభినవ్ కు తమ గోడు  వినిపించిఫిర్యాదు చేశారు. ఎస్ఐ సంబంధిత విషయంపై మాట్లాడిన  ఎలాంటి ఫలితం  రాలేదని అన్నారు. బోరు నీళ్ళు కరెంట్ కనెక్షన్  తొలగించి నెలరోజులైనా సంబంధిత అధికారుల కు  చెప్పినా ఎవరూ పట్టించుకోవడం  లేదని సంబంధిత జిల్లా కలెక్టర్ కు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని నన్ను నా కుటుంబాన్ని  ఆదుకోవాలని లేనిపక్షంలో ఆత్మహత్యే శరణ్యమన  వారు  ఆ ప్రకటనలో పేర్కొన్నారు.