లక్ష రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయాలి.
సర్వసభ్యసమావేశం తీర్మానం
పిట్లం, సెప్టెంబర్13జనంసాక్షి,
లక్షరూపాయల రుణమాఫీని ప్రభుత్వం ఏకకాలంలో చేయాలని కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్న కొడప్ గల్ సింగిల్ విండో ఆవరణలో అధ్యక్షులు టి.నారాయణ రెడ్డి అద్వర్యంలో
మంగళవారం జరిగిన సర్వసభ్యసమావేశము ఏకగ్రీవంగా తీర్మానించింది.సంఘ పరిధిలోని బుర్నా పూర్,పారడ్ పల్లి గ్రామాలలో కొత్తగా పిపిసి సెంటర్లు ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానం చేశారు.ఇప్పటివరకు సంఘంలో రుణం పొందని రైతులకు పంట రుణాలు ఇస్తామని సింగిల్ విండో చైర్మన్ తెలిపారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలని సంఘం అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. వన్ టైం సెటిల్మెంట్ కు అర్హులైన రైతులు సకాలంలో రుణాలు చెల్లించి రాయితీని పొందాలని సీఈఓ హన్మాండ్లు సభ్యులకు సూచించారు.వన్ టైంసెటిల్ మెంట్ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోని రైతులపైన చట్టపరమైన చర్యతీసుకోవాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ సాయగౌడ్ ,డైరెక్టర్లు, సర్పంచులు,ఎంపిటిసిలు,సంఘ సభ్యులు పాల్గొన్నారు