లబ్ధిదారులకు నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ

జనంసాక్షి/రేగోడ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఆసరా పిoచన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.ఈ సందర్భంగా బుధవారం నాడు స్థానిక శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ ఆదేశానుసారం జగిర్యాల గ్రామానికి చెందిన 32మందికి కొత్త పెన్షన్ మంజూరు
అయిన వారికి పింఛన్ పత్రాలు అందించడం జరిగిందని జగిర్యాల గ్రామ అధ్యక్షులు జుర్రు రమేష్, రేగోడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్, మండల మహిళ అధ్యక్షురాలు నాగారం కల్పన,రేగోడ్ ఎంపిటిసి గొల్ల నర్సింలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చిత్రపటాలకు పాలభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు దుర్గయ్య, జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మెన్ లక్ష్మయ్య వార్డ్ మెంబర్లు హామీద్,నాగప్ప,మాజీ సర్పంచ్ మోతిరం,మాజీ ఉపసర్పంచ్ సత్యాగౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ,కుమార్, బాలయ్య,కుందేళ్ల రమేశ్, జుర్రు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.