లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కు పురస్కారం

ములుగు బ్యూరో,సెప్టెంబర్16(జనం సాక్షి):-
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ శ్రావణ్ కు పురస్కారం లయన్స్ క్లబ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో ఆయా వృత్తులలో ప్రతిభావంతులైన వారికి మేమొంటో అందించి సన్మానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పాలంపేట గ్రామానికి చెందిన తడండ్ల శ్రావణ్ ఉమ్మడి జిల్లాలో బెస్ట్ పోటోగ్రాపర్ గా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న శ్రావణ్ ను ఎంపిక చేసి లయన్స్ క్లబ్ హన్మకొండ అధ్యక్షులు డాక్టర్ ఈ రాంరెడ్డి కార్యవర్గం సన్మానం చేయడం జరిగింది.ఫెస్టివల్ అండ్ ట్రావెల్ విభాగానికి గెలుపొందిన చిత్రాలు తెలంగాణ పండగలు కావడం విశేషం.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పోటోగ్రాపర్స్, వీడియో గ్రాపర్స్ అధ్యక్షుడు జి.లింగమూర్తి , రాంరెడ్డి కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు,
2 Attachments • Scanned by Gmail