లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నారా సంచులు పంపిణి
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్ల వాడకంతో భూతాపం పెరిగి పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారిందని అటువంటి వాటిని
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ కవర్ల వాడకంతో భూతాపం పెరిగి పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారిందని అటువంటి వాటిని బహిష్కరించి పర్యావరణాన్ని కాపాడుట మన అందరి బాధ్యత
అని లైన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు
కొనతం సీతారాం రెడ్డి,పోరెడ్డి శ్రీరామ రెడ్డి, బట్టుమధు లు అన్నారు.ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం,పూర్వ లయన్ డిస్టిక్ గవర్నర్ కాపా మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం నేరేడుచర్ల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రకృతికి నష్టం కలిగించని నారా సంచులను లైన్స్ క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చల్లా ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి జిలకర రామస్వామి, పూర్వ అధ్యక్షులు కందిబండ శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్,కర్రి సూరిబాబు మన్నెం మాల్యాద్రి,బాలెన సైదులు, మా శెట్టి సైదయ్య,చామకూరి వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.