లలితా దేవి అలంకరణలో వాసవి మాత దర్శనం.

ఎమ్మెల్సీ తనయుడు కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల లో భాగంగా శనివారం వాసవి మాత లలితా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేశ్వర్ రెడ్డి వాసవి మాత ను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపెద్ది శివకుమార్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గత ఆరు రోజులుగా పూజలను విజయవంతం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతివారం ఆలయ ఆవరణలో హోమం నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని ఆసక్తి కలిగిన భక్తులు ఆలయ పూజారిని కానీ ఉత్సవ కమిటీని కానీ సంప్రదించాలని కోరారు.అనంతరం సామూహిక పూజా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం నిర్వహించిన కుంకుమార్చన సామూహిక పల్లవి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం వనపర్తి స్వర్ణలహరి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు హకీం రాజేష్,బొడ్డు రమణ, చంద్రశేఖర్,పాలాది యాదయ్య, బాదం రమేష్, శ్రీనివాసులు,సాయిరాం, సాయి కృష్ణ, బాలాజీ, రాజు, చంద్రమోహన్ రాము, అల్లంపల్లి రమేష్, రాజు, రమణ, బాదం పరమేష్,సాయి శంకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.