లవ్ యువర్ ఐస్(మీ కండ్లను ప్రేమించండి)

 

-ఉమ్మడి జిల్లా డి.బి.సి.ఎస్.ఇంఛార్జి అధికారి డా,బి.మోతీలాల్…

నాగర్ కర్నూల్ రూరల్ అక్టోబర్ 13(జనంసాక్షి)

గురువారం రోజున ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా జిల్లా నియంత్రణ సంస్థ మహబూబ్ నగర్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నాగర్ కర్నూల్,ఆధ్వర్యంలో ప్రపంచ దృష్టి దినోత్సవం వేడుకలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగర్ కర్నూల్ యందు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్,మోతిలాల్ ఆధ్వర్యంలో నేత్ర సంరక్షణ గురించి నేత్రదానం గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్,కే.సుధాకర్ లాల్ మాట్లాడుతూ,విద్యార్థులు నేత్ర సంరక్షణ గురించి జాగ్రత్తలు పాటించాలని సెల్ ఫోన్లకు,టీవీలకు దూరంగా ఉండాలని విద్యార్ది దశలో కంటిచూపు సంరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందని సవివరంగా వివరించారు.ఈ సంద్భంగా లవ్ యువర్ ఐస్(మీ కళ్ళను ప్రేమించండి)అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్,ఎం.వెంకట్ దాస్,జిల్లా కంటి వైద్యులు డాక్టర్,పవన్ కుమార్ రెడ్డి,ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్,శ్రవణ్ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కురుమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరము ప్రపంచ దృష్టి దినోత్సవ సందర్భంగా,ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని కంటి వైద్య సహాయకులు బి.శివారెడ్డి,సిహెచ్.గణేష్,యుగంధర్ ప్రసాద్,బావండ్ల.వెంకటేష్,రామ్ రెడ్డి,రఘునందన్,వెంకటస్వామి,కొట్ర.బాలాజీ,వెంకటేశ్వర చారి,రమాదేవి,మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆర్ శ్రీనివాస్,రేనయ్య, డి.కుమార్ పాల్గొన్నారు.