లాటరీ పద్దతి ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల ను కేటాయించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ పట్టణంలోని. బంగల్ పెట్,  నగునాయి పేట్  లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో  పూర్తి పారదర్శకత  పాటించి లబ్ధిదారులకు ఇళ్ల ను కేటాయించడం జరిగిందని  జిల్లా పాలనాధికారి అన్నారు.స్థానిక తిరుమల గార్డెన్,  దివ్యాగార్డెన్, రాజారాజేశ్వర గార్డెన్ లలో   శుక్రవారం ఏర్పాటు చేసిన  ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో  జిల్లా పాలనాధికారి అత్యంత పకడ్బం దిగా ఏర్పాట్లు చేసి,  అదనపు కలెక్టర్ లు  హేమంత్ బోర్కడే,  రాంబాబు లతో  కలసి  ఇళ్ల కేటాయింపు కార్యక్రమాన్ని  ప్రారంభించారు.
ఈ సందర్బంగా  జిల్లా పాలనాధికారి  మాట్లాడుతూ  రెండు పడకల గదుల  పంపిణిలో  ఎంతో పారదర్శకత తో   లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని,
ఎవరు కూడా ఇండ్ల మంజూరిలో దళారులను ఆశ్రయించవద్దని ,   ఎవరూ ఎవరికీ  ఒక్క రూపాయి కూడా  ఇవ్వనవసరం లేదని,  ఎవరైనా  లబ్ధిదారులు నుండి  డబ్బులు వసూలు చేస్తే  వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.
 లబ్ధిదారులకు  లాటరీ పద్దతి ద్వారా వార్డుల వారిగా  ఇళ్లు కేటాయించారు.
బంగల్ పేట్,  నగునాయిపేట్ లలో   34 వార్డులలో   1248 ఇళ్లను అర్హులైన వారికి కేటాయించడం  జరిగిందని,  సంక్రాతి లోపు  అన్ని హంగులతో  పూర్తి చేసి  లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.తిరుమల గార్డెన్ లో  469,
రాజారాజేశ్వర గార్డెన్ లో  323 మంది  లబ్ధిదారులు,   దివ్యాగార్డెన్ లో 456,   మొత్తం  1248  మంది  లబ్ధిదారులకు  ఇళ్లను కేటాయించడం  జరిగిందని తెలిపారు.ఈ సమావేశం లో  dsp జీవన్ రెడ్డి ,mro సుభాష్ చందర్, కిరణ్మయి, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు