లారీ బోల్తా పడి ఇద్దరు మృతి
తాళ్లూరు : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురం వద్ద ఈ ఉదయం ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. 17 మందికి గాయాలయ్యాయి. మృతులను యర్రగొండపాలెం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.