లింగాల మండలంలో ఉచిత చేపలు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్పు గువ్వల బాలరాజు
జనం సాక్షి లింగాల ప్రతినిధి:
లింగాల మండలంలో మత్స్యకారులకు ఉచితంగా చేపల పంపిణీ చేసి చెరువులో చేప పిల్లల్ని వదిలారు అదేవిధంగా గతంలో కూడా మత్స్యకారులకు ఉచిత టీవీఎస్ లు వాహనాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చామని గుర్తు చేశారు
మన భారతదేశంలోనే అత్యధికంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒకటేనని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని లింగాల మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పంపిణీ చేశారు ఆడపడుచులకు చిరు కానుక గా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డ లందరికీ కెసిఆర్ బతుకమ్మ చీరలు కానుకగా అందిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఏడాది బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం 339 కోట్లు వెచ్చిస్తున్న దని చెప్పారు. 10 రంగులు ,18 డీజే లో, రెండు వందల రకాల చీరలను ఆడబిడ్డలకు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం దత్తరం గ్రామంలో గుమ్మకొండ సాయిలు కు దళిత బంధు పథకం10 లక్షల రూపాయలతో సెంట్రింగ్ మంజూరు కావడంతో సెంట్రింగ్ కొబ్బరికాయ కొట్టి , రుబ్బిన కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు అధికారులు తాసిల్దార్ మునీరుద్దీన్. సర్పంచ్ తిరుపతయ్య. మాకం తిరుపతయ్య కేటి తిరుపతయ్య వివిధ గ్రామాల సర్పంచులు. ఎంపీటీసీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు