లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తి

     భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రి గుట్ట పై వేలసిన లక్ష్మీ నరసింహస్వామిని శనివారం నాడు హై కోర్ట్ న్యాయమూర్తి సుధాశ్రీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి న్యాయమూర్తి కి  ప్రత్యేక దర్శనం చేయించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత గురించి వివరించారు.ఆలయ ప్రాంగణంలో మాడ వీధుల్లో సందర్శించి,చాలా ఆహ్లాదకరంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గతంలో 2003 సంవత్సరం లో,అలాగే 2019 సంవత్సరం లో నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్ననని అన్నారు.ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు.లింబాద్రి గుట్టకు న్యాయమూర్తి వచ్చిన విషయం తెలుసుకున్న ఆర్ముర్, నిజామాబాద్ న్యాయవాదులు అక్కడకు చేరుకుని ఘనంగా సన్మానించారు. ఆమె వెంట జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత,జిల్లా జూనియర్ సివిల్ న్యాయమూర్తి భవ్యశ్రీ, ఆర్ముర్ కోర్ట్ సివిల్,అసిస్టెంట్ సెషన్, మేజిస్ట్రేట్ న్యాయమూర్తులు నసీమా సుల్తానా, రాచర్ల షాలిని,వేముల దీప్తి,ఏసీపీ ప్రభాకర్ రావ్,భీంగల్ సిఐ వెంకటేశ్వర్లు,ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.