లేబర్ ఇన్సూరెన్స్ చట్టం లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం.

– భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు.

బూర్గుంపహాడ్ అక్టోబర్ 01(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండలం సారపాకలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో లేబర్ ఇన్సూరెన్స్ చట్టం లేకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిందని శనివారం ఆరోపించారు. ఈ సమావేశంలో బత్తుల మాట్లాడుతూ భవనిర్మాణ కార్మిక సంఘం, పెయింటర్ల యూనియన్ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం లేబర్ ఇన్సూరెన్స్ చట్టం లేకుండా చేసిందని అన్నారు. కేంద్రం రాష్ట్రాలపైన మోపటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ కు సంబంధించి రావాల్సిన డబ్బులు సక్రమంగా ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు. పెళ్లిళ్లు, డెలివరీ, అనారోగ్యమైన సమస్యలతో మరణించినా ప్రమాదంలో చనిపోయిన వారికి సంబంధించిన దరఖాస్తు పెట్టుకున్న సంవత్సరాలు తరబడి పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. అవి అందక కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ ఇన్సూరెన్స్ చట్టాన్ని తీసేయాలని కుట్రలో భాగంగానే కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘ యూనియన్ అధ్యక్షులు సగేం శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు వై అప్పారావు, కోశాధికారి తోట మల్లయ్య, సిహెచ్ రమణయ్య, ఓర్సు పండు, పి వేణు, పెరిక సామి, మధు, రాంజీ, కృష్ణ, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.